బీహార్ గుండాలు వస్తున్నారు జాగ్రత్త....!

Update: 2018-10-26 04:35 GMT

రాష్ట్రంలో అరాచకాలను సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు రానివ్వకుండా అడ్డుకునేందుకు శాంతిభద్రతలకు విఘాతం కల్పించాలని కొందరు చూస్తున్నారన్నారు. అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజల్లో అలజడి సృష్టించడానికి ఏపీలో కుట్ర జరుగుతుందన్నారు. త్వరలో దేవాలయాలు, మసీదులు, చర్చిలపై కూడా దాడులు జరిగే అవకాశముందన్నారు. వైసీపీ ఉచ్చులో తాను పడిపోయాయని, నాకంటే కేసీఆర్ కు ఎక్కువ మెచ్యూరిటీ ఉందని మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. ఏమాత్రం భయపడవద్దని, ఆపరేషన్ గరుడ ను తాను సీరియస్ గా తీసుకోలేదని, నాలుగైదు నెలలు ముందే శివాజీ చెప్పింది వరుసగా జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్ష నేతపై ప్రాణహాని లేని దాడి చేసి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలన్నది శివాజీ ముందుగానే చెప్పారన్నారు. బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి గూండాలను తెప్పించి ఇక్కడ శాంతిభద్రతలకు విఘాతం కల్గించే అవకాశాలున్నాయన్నారు. ఏపీపై అనవసర వేధింపులకు పాల్పడుతున్నారన్నారు.

Similar News