హరికృష్ణ అలా మాట్లాడుతుంటే...?

Update: 2018-08-30 03:59 GMT

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. కొద్దిసేపటి క్రితం మెహదీ పట్నంలోని హరికృష్ణ నివాసానికి వచ్చిన వెంకయ్యనాయుడు ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిర్భీతిగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తూ, తండ్రికి తగ్గ తనయుడిగా వ్యవహరించే హరికృష్ణ మరణం తనను కలచి వేసిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

నిర్మొహమాటంగా......

హరికృష్ణ ఏ విషయంలోనైనా సరే చెప్పదలచుకున్నదాన్ని కుండబద్దలు కొట్టేవారు. రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుపడితే, ఆనాడు సభాపతి నిబంధనల ప్రకారం అభ్యంతరం చెబితే తాను మాతృభాషలో మాట్లాడేందుకు అనుమతివ్వమని సభాపతికి సర్దిచెప్పానన్నారు. హరికృష్ణకు తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉందన్నారు. తెలుగు జాతి ఖ్యాతి, గౌరవాన్ని ప్రపంచం నలుదిశలా వ్యాప్తి చేసిన ఎన్టీరామారావుకు సరైన వారసుడు హరికృష్ణ అని వెంకయ్య అభిప్రాయపడ్డారు.

Similar News