Nadendla : భీమవరం రిజల్ట్ వస్తున్నప్పుడు పవన్ ఏమన్నారంటే?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దాడి చేయడం సరికాదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కావాలని వైసీీపీ నేతలు [more]

Update: 2021-09-29 07:03 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దాడి చేయడం సరికాదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కావాలని వైసీీపీ నేతలు రెచ్చగొడుతున్నారని, ఆ ట్రాప్ లో పడవద్దని జనసేన క్యాడర్ కు ఆయన సూచించారు. పవన్ కల్యాణ్ ప్రతి ఒక్కరినీ గౌరవించే వ్యక్తి అని, రాజకీయాల కోసం అన్నీ వదులుకున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసైనికులకు పార్టీ అండగా నిలబడుతుందని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. భీమవరం ఫలితాలు వస్తున్నప్పుడు పవన్ కల్యాణ్ తనతో ఒక మాట అన్నారన్నారు. భీమవరంలో హోరా హోరీ పోరు జరుగుతున్న సమయంలో పవన్ కల్యాణ్ తాను ఒక్కడినే శాసనసభకు వెళ్లలేనని, అందరితో కలసే వెళదామని పవన్ కల్యాణ్ తనతో అన్న విషయాన్ని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. ఏపీలో జనసేన మాత్రమే ప్రతిపక్షమని ఆయన అన్నారు.

Tags:    

Similar News