కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు ఈయనే

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ముకుల్ వాస్నిక్ ను నియమించే అవకాశముంది. రేపు కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంపై ఒక స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ అధ్యక్ష [more]

Update: 2019-08-09 14:48 GMT

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ముకుల్ వాస్నిక్ ను నియమించే అవకాశముంది. రేపు కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంపై ఒక స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రెండు నెలల క్రితం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికలలో ఓటమితో రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్ ఓరాను నియమించారు. రాహుల్ గాంధీ తో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు విముఖత చూపడంతో కొత్త వారిని ఎంపిక చేయాల్సిన పరిస్థిితి ఏర్పడింది. 59 ఏళ్ల ముకుల్ వాస్నిక్ మాజీ మంత్రి. ఆయనకు పార్టీ వ్యవహారాలపై పట్టు ఉండటంతో ఆయనను నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Tags:    

Similar News