ఆ దేశంలో పర్యటించిన తొలి ప్రధాని మోదీనే

Update: 2018-07-24 08:29 GMT

విదేశాలతో భారత్ కు సత్సంబంధాలు ఏర్పరచడంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆయన పదవి చేపట్టిన నాటి నుంచే అనేక దేశాల్లో పర్యటించారు. ఎవరూ ఊహించని విధంగా పాకిస్తాన్ లోనూ హఠాత్తుగా ఆయన పర్యటించారు. ఇంతవరకు భారత ప్రధానులు పర్యటించని దేశాల్లో కూడా మోదీ పర్యటించారు. అలాంటి దేశమే ఆఫ్రికా ఖండంలోని రువాండా. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మూడు రోజుల ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన నరేంద్ర మోదీ.. మొదటి రోజు తూర్పు ఆసియా దేశమైన రువాండాలో పర్యటిస్తున్నారు. ఆయనను ఎయిర్ పోర్టుకు వచ్చి మరీ ఆ దేశ అధ్యక్షుడు పాల్ కగామే స్వాగతం పలికారు. రూవాండాకు భారత్ తరుపున రుణం రూపంలో 200 మిలియన్ డాలర్లను భారత్ అందించనుంది. అయితే, ప్రతి పేద కుటుంబానికి ఒక ఆవు ఇచ్చే పథకాన్ని ఆ దేశం ప్రవేశపెట్టింది. ఈ పథకానికి మెచ్చిన నరేంద్ర మోదీ ఆ దేశానికి భారత్ తరుపున 200 ఆవులను కానుకగా ఇవ్వనున్నారు.

Similar News