బ్రేకింగ్ : రైల్వే స్టేషన్ దగ్గర టెన్షన్… ఒకసారిగా వేలాది మంది?

ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ ను మరోసారి పొడిగిస్తూ ప్రకటన చేసిన వెంటనే వలస కూలీలు ఇక ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మే 3వ తేదీ [more]

Update: 2020-04-14 12:59 GMT

ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ ను మరోసారి పొడిగిస్తూ ప్రకటన చేసిన వెంటనే వలస కూలీలు ఇక ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించడంతో తమకు ఉపాధి దొరకదని భావించిన వేలాది మంది కూలీలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన ఈ సమయంలో వేలాది మంది ఒక్కసారిగా రైల్వే స్టేషన్ కు చేరుకోవడంతో పోలీసులు కూడా విస్తుపోయారు. వారికి నచ్చ చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. వలస కూలీలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టలేదని, దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు. వీరంతా బీహార్, యూపీ, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు.

Tags:    

Similar News