జనసేనలో చేరిన ఎమ్మెల్యే

బీజేపీకి రాజీనామా చేసిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కండువా [more]

Update: 2019-01-21 12:41 GMT

బీజేపీకి రాజీనామా చేసిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు రాజమండ్రి నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు కూడా జనసేనలో చేరారు. బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని బెంగ పెట్టుకున్న ఆకుల… గత కొన్నిరోజులుగా ఆ పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్నారు. ఆయన బీజేపీలో ఉన్నా ఆయన భార్య మాత్రం జనసేన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయం అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆయన ఇవాళ జనసేన పార్టీలో చేరిపోయారు. రానున్న ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ స్థానం నుంచే ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News