సెలెక్ట్ కమిటీ ఇక లేనట్లే

పథ్నాలుగు రోజులు ముగిసినందున ఇక రెండు బిల్లులు ఆమోదం పొందినట్లేనని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. బిల్లుల విషయంలో సభ ముందు ఉన్న ఆప్షన్లు మూడేనని, [more]

Update: 2020-02-11 11:47 GMT

పథ్నాలుగు రోజులు ముగిసినందున ఇక రెండు బిల్లులు ఆమోదం పొందినట్లేనని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. బిల్లుల విషయంలో సభ ముందు ఉన్న ఆప్షన్లు మూడేనని, అవి ఆమోదించడం, తిరస్కరించడం, సెలెక్ట్ కమిటీకి పంపడమేనని ఆయన తెలిపారు. ఈ మూడింటిని పథ్నాలుగు రోజుల్లో చేయలేకపోయినందున సీఆర్డీఏ రద్దు బిల్లులు, అధికార వికేంద్రీకరణ బిల్లులు ఆమోదింపబడినట్లేనని మంత్రి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. విచక్షణాధికారాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించడం కుదరదని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ సెలెక్ట్ కమిటీ నియామకం జరగకపోవడంతో ఇక గవర్నర్ వద్దకు పంపి ఈ రెండు బిల్లులను ఆమోదింప చేసుకుంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News