రాధాకృష్ణా ఆ దమ్ముందా నీకు?

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణపై ఫైరయ్యారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడం కోసమే అప్పటి ఎండీ సురేంద్రబాబును ప్రభుత్వం తప్పించిందని తప్పుడు [more]

Update: 2019-10-17 13:08 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణపై ఫైరయ్యారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడం కోసమే అప్పటి ఎండీ సురేంద్రబాబును ప్రభుత్వం తప్పించిందని తప్పుడు ప్రచారం చేసిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఎందుకు అదే పత్రికలో వేయలేదని, అంత దమ్ములేదా? అని ప్రశ్నించారు పేర్నినాని. చంద్రబాబు అనుకూల మీడియా జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకే ప్రయత్నిస్తుందన్నారు. అవాస్తవ వార్తలు రాస్తే కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు. కావాలని బురద జల్లుతుంటే బతిమాలతారా? అని పేర్ని నాని నిలదీశారు. తమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం కక్కుతుందన్నారు. తాముచేసిన మంచి పనులు చెప్పకుండా, అవాస్తవ వార్తలను ప్రచురిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో మీడియాపై కేసులు పెట్టలేదా? ఉత్తర్వులు జారీ చేసింది నిజం కాదా? అని నిలదీశారు. జగన్ పారదర్శక పాలన అందిస్తుంటే ఓర్వలేకపోతున్నారన్నారు. మీడియా పై తమ ప్రభుత్వానికి ఎప్పుడూ గౌరవం ఉందన్నారు. కానీ కావాలని, ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ అవాస్తవ కథనాలను ప్రజల్లోకి పంపాలని ప్రయత్నిస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామనడంలో తప్పేమిటని పేర్నినాని ప్రశ్నించారు

Tags:    

Similar News