కోడెల మృతికి కారణం చెప్పిన కొడాలి

టీడీపీలో ఎదురైన అనేక అవమానాలతోనే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తీవ్ర మనోవేదనకు గురయ్యారని మంత్రి కోడాలి నాని అన్నారు. కోడెలపై ప్రభుత్వం ఏ [more]

Update: 2019-09-17 07:15 GMT

టీడీపీలో ఎదురైన అనేక అవమానాలతోనే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తీవ్ర మనోవేదనకు గురయ్యారని మంత్రి కోడాలి నాని అన్నారు. కోడెలపై ప్రభుత్వం ఏ కేసు పెట్టలేదన్నారు. 40 మంది కేసులు పెడితే కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడా అని కొడాలి ప్రశ్నించారు. 1999లో కోడెలకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టలేదా అని మంత్రి నాని చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ఎన్నికల్లో ఆరుసార్లు గెలిచినా 2014లో సత్తెనపల్లి వద్దు నర్సారావు పేట కావాలంటే ఇవ్వకుండా కోడెలను మనోవేదనకు గురిచేయలేదానని మండిపడ్డారు. కేసులు పెడితే ఎవరైనా పోరాటం చేస్తారే కాని ఆత్మహత్యలు చేసుకోరన్నారు. కోడెలను అవమానించింది చంద్రబాబేనని మంత్రి నాని చెప్పారు.

చంద్రబాబు పక్కన పెట్టారనే…..

రాజకీయాల్లో 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవమున్న కోడెల ఈరోజు చనిపోయే సరికి పల్నాటి పులి అయిపోయాడాఅని ఎద్దేవా చేశారు. నమ్మిన కుటుంబం మోసం చేస్తే, పార్టీ అధినేత చంద్రబాబు పక్కన పెడితే నే ఆత్మహత్య చేసుకున్నారని నాని ఆరోపించారు. కోడెల వల్ల పార్టీ ఇబ్బంది పడుతుందని గుంటూరు జిల్లా నాయకులతో చంద్రబాబు చర్చించలేదానని ప్రశ్నించారు. కోడెలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చించడం వాస్తవం కాదా? అని నిలదీశారు. మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవి ఇచ్చి ఆయనను మనోవేదనకు గురిచేశారని ఆరోపించారు.

బాబు అపాయింట్ మెంట్ ఇవ్వనందుకే….

నిన్న ఉదయం 9.30 వరకు కోడెల శివప్రసాద్ చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారని, ఆయనను కలవకుండా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా విజయవాడకు బాబు వెళ్లిపోలేదా అని ప్రశ్నించారు నాని. ప్రభుత్వ బాధితుల కోసం పల్నాడులో జరిగిన మీటింగ్ లో కోడెల ఎందుకు పాల్గొనలేదన్నారు. కోడెల పులి అయితే చంద్రబాబు నక్కగా నాని అభివర్ణించారు. ఎన్ఠీఆర్ పైనా ఇదే విధంగా ప్రచారం చేసి ఆయన చావుకి చంద్రబాబే కారణమయ్యాడని నాని ఆరోపించారు. కోడెల చనిపోతే ప్రభుత్వం వేధించిదంటున్న చంద్రబాబు ఈ మూడు నెలల్లో ఒక్కసారైనా కోడెల కేసులపై మాట్లాడారా? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు నక్కజిత్తుల బతుకు గురించి కోడెల ఎక్కడ మాట్లాడుతారోననే భయంతోనే వదిలించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కోడెల కాల్ డేటా పూర్తిగా పరిశీలించి విచారణ జరపాలని నాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించారు. చంద్రబాబును కూడా విచారించాలన్నారు. రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదని, అన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు నాని.

 

Tags:    

Similar News