బ్రేకింగ్: వేయి గొంతులు మూగబోయాయి

Update: 2018-06-19 06:36 GMT

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల వేణుమాదవ్ మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. వరంగల్ నగరంలోని మట్టెవాడలో 1932 డిపెంబరు 28న జన్మించారు. ఆయన మిమిక్రీలో ఆయన ఎంతో పేరుగాంచి ఎంతోమంది మిమిక్రీ కళాకారులకు ఆదర్శంగా నిలిచారు. మూడు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు వేణుమాధవ్ పద్మశ్రీ కూడా అందుకున్నారు. ఇటీవల ప్రభుత్వం ఆయన పేరుతో పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేసింది. ఆయన మరణం మిమిక్రీ రంగానికి తీరనిలోటుగా చెప్పవచ్చు.

Similar News