సంచలనంగా మారిన మెడికల్ సీట్ల స్కాం

Update: 2018-06-06 11:20 GMT

తెలంగాణలో స్పోర్ట్స్ కోటా కింద మెడికల్ సీట్ల కేటాయింపులో జరిగిన కుంభకోణం సంచలనంగా మారింది. స్పోర్ట్స్ కమిటీ సభ్యులుగా ఉన్న వారు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని అనర్హులకు మెడికల్ సీట్లు కేటాయించారు. దీంతో మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం త్రిసభ్య కమిషన్ వేసి విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు స్పందించారు. వెంటనే బుధవారం స్పోర్ట్స్ కమిటీ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. హబ్సిగూడ, రామంతాపూర్, ఎల్బీ స్టేడియం సహా ఐదు చోట్ల ఏకకాలంలో సోదాలు జరిగాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ రమణ ఇంటిలో కూడా ఉదయం నుంచే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

వెంకటరమణ దే కీలక పాత్ర

స్పోర్ట్స్ కమిటీ సభ్యుల ఇళ్లలో సోదాలపై ఏపీబీ డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు కుంభకోణం కేసులో ధర్యప్తు చేస్తున్నామని, డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణ ఇంట్లో ఉదయం నుండి సోదాలు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 9 మంది సభ్యులు గల కమిటీ స్పోర్ట్స్ నకిలీ సర్టిఫికెట్లు లు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఇందులో వెంకట రమణ ది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఎంత మందికి ఇలా నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారన్న దానిపై వెంకట రమణని విచారిస్తున్నామని, దర్యాప్తు పూర్తయిన తరువాత నివేదికను ఉన్నదికారులకి అందజేస్తామని వివరించారు. అర్హులైన వారికి కాకుండా వేరే వారికి సీట్లు కేటాయించారని తమకి ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు.

Similar News