బ్రేకింగ్ : హైదరాబాద్ లో ముగ్గురు మావోల అరెస్ట్

హైదరాబాద్ లో ముగ్గురు మావోయిస్టులను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో హైదరాబాద్ లోని మౌలాలిలో నివసిస్తున్న వీరిని మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి [more]

Update: 2018-12-25 06:54 GMT

హైదరాబాద్ లో ముగ్గురు మావోయిస్టులను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో హైదరాబాద్ లోని మౌలాలిలో నివసిస్తున్న వీరిని మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండటం గమనార్హం. ఆత్మకూరు అన్నపూర్ణ, ఆత్మకూరు అనూషతో పాటు కొర్రా కామూశ్వరరావును వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురూ స్వయంగా మన్యంలో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కేతో వీరికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయన్నారు.

బీటెక్ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ…

2017 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్న వీరు పోలీసులపై దాడికి పాల్పడిన మూడు ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. వీరితో స్వస్థలం విశాఖపట్నం జిల్లాగా తెలుస్తోంది. అయితే, అరెస్ట్ అయిన అక్కాచెల్లెళ్లు అన్నపూర్ణ, అనూషలు బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, నిన్ననే చత్తీస్ గఢ్ లో మావోలకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న నక్కా వెంకట్ రావు అనే ఎన్జీఆర్ఐ ఉద్యోగి పోలీసులకు దొరికిన విషయం తెలిసిందే..

Tags:    

Similar News