Rk : 14న ఆర్కే మృతి… అంత్యక్రియలు పూర్తి చేశాం

మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే మరణించినట్లు మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 14వ తేదీన ఆర్కే మరణించారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి [more]

Update: 2021-10-15 07:23 GMT

మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే మరణించినట్లు మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 14వ తేదీన ఆర్కే మరణించారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ వెల్లడించారు. 63 సంవత్సరాలున్న ఆర్కే అనేకరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని అభయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కిడ్నీలు ఫెయిల్ కావడంతో….

ఆర్కేను బతికించుకోవడానికి పార్టీ అన్ని ప్రయత్నాలు చేసిందని, చివరకు దక్కించుకోలేకపోయామని మావోయిస్టు పార్టీ పేర్కొంది. కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ కావడంతో ఆర్కే మరణించారని అభయ్ పేర్కొన్నారు. పార్టీ సభ్యుల సమక్షంలోనే ఆర్కే అంత్యక్రియలను కూడా నిర్వహించినట్లు మావోయిస్టు పార్టీ పేర్కొంది.

Tags:    

Similar News