మమతా బెనర్జీలో ఈ యాంగిల్ కూడా ఉందా..?

Update: 2018-10-12 10:05 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరు చెబితే ఆమె నిరాడంబరత, బలమైన నాయకత్వం గుర్తుకువస్తాయి. ఇక ప్రతిపక్షాలు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో పట్టు కోసం ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ఆమె కేవలం ఒక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని, హిందూ వ్యతిరేకి అని ముద్ర వేస్తున్నారు. హిందూ పండుగలపై బెంగాల్ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధిస్తోందని మమతపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఆమె మాత్రం దుర్గా నవరాత్రుల కోసం ఏకంగా రచయిత్రిగా మారిపోయింది. కలకత్తాలో శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయని తెలిసిందే. నవరాత్రుల సందర్భంగా దుర్గా మాతపై మమతా బెనర్జీ స్వయంగా ఏడు సంకీర్తనలు రాసి తన భక్తిని చాటుకున్నారు. ఈ కీర్తనలను ఆమె స్వయంగా స్వరపర్చగా ప్రముఖ బెంగాలీ గాయకులు ఇంద్రనీల్, లోకాముద్ర, రుద్రాంకర్ పాడారు. ఈ సంకీర్తనలను రౌద్రఛాయ పేరుతో మమతా విడుదల చేశారు.

Similar News