ఇవేం ఎన్నికలు..ఇదేం పద్ధతి.. మమత ఫైర్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఎనిమిది విడతలుగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన రాష్ట్రాలకు ఒకే విడత ఎన్నికలు జరుపుతుండగా, పశ్చిమ [more]

Update: 2021-02-27 02:14 GMT

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఎనిమిది విడతలుగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన రాష్ట్రాలకు ఒకే విడత ఎన్నికలు జరుపుతుండగా, పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది విడతలు ఎందుకని మమత బెనర్జీ ప్రశ్నించారు. బీజేపీ ప్రయోజనాల కోసమే ఎన్నికల కమిషన్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఎనిమిది విడతలుగా నిర్వహిస్తుందన్నారు. మోదీ అమిత్ షాల ప్రాపకం కోసమే ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కాగా పశ్చిమ బెంగాల్ లో మార్చి 27న తొలి దశ, ఏప్రిల్ 1న రెండో విడత, ఏప్రిల్ 6న మూడో దశ, ఏప్రిల్ 10న నాలగోదశ, ఏప్రిల్ 17న ఐదోదశ, ఏప్రిల్ 22న ఆరోదశ, ఏప్రిల్ 26న ఏడోదశ, ఏప్రిల్ 29న ఎనిమిదో దశ పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలను ప్రకటిస్తారు.

Tags:    

Similar News