బ్రేకింగ్ : సుమిత్రా మహాజన్ మళ్లీ అదే చేశారే

Update: 2018-04-05 06:45 GMT

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్ సభను సెకన్లలోనే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సభ తిరిగి 12 గంటలకు ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. ఆందోళనల మధ్యనే స్పీకర్ సభ కార్యక్రమాలను చేపట్టారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ సభలోచర్చించాల్సిన ముఖ్యమైన విషయాలున్నాయని, వాటిని అడ్డుకోవద్దని పదే పదే సూచించారు. అవిశ్వాసంపై చర్చ పెట్టాలని ఖర్గే డిమాండ్ చేశారు. మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ సభను ఆర్డర్ లో ఉంచి అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని స్పీకర్ ను కోరారు. అవిశ్వాసంతో పాటు ఏ అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనంతకుమార్ తెలిపారు. ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సభ్యులను ఆందోళన విరమించి తమ తమ స్థానాల్లో కూర్చోవాలని పదే పదే కోరారు. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాసం నోటీసులను చదివి విన్పించారు. సభ ఆర్డర్ లో లేకపోవడంతో అవిశ్వాసంపై మద్దతున్న సభ్యులను తాను లెక్చించలేనని చెప్పారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు. రేపటితో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి.

Similar News