బిగ్ బ్రేకింగ్ : ఏపీలో ఎన్నికలు వాయిదా

కరోనా ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల [more]

Update: 2020-03-15 04:44 GMT

కరోనా ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆరు వారాల పాటు ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని ఆయన చెప్పారు. కరోనా ఎఫెక్ట్ తో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయడంతో మరో ఆరు వారాల పాటు వేచిచూడక తప్పదు. ఎన్నికలను అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ వాయిదా వేయక తప్పడం లేదని ఆయన చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికయిన వారు కొనసాగుతారని ఆయన తెలిపారు.

Tags:    

Similar News