ఫరీఫ్ చెప్పి నాలుగురోజులైనా?

సెలెక్ట్ కమిటీ రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఈ నెల 26వతేదీన శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. అయితే నాలుగు రోజులు గడుస్తున్నా సెలక్ట్ కమిటీ నియామకం [more]

Update: 2020-01-30 08:46 GMT

సెలెక్ట్ కమిటీ రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఈ నెల 26వతేదీన శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. అయితే నాలుగు రోజులు గడుస్తున్నా సెలక్ట్ కమిటీ నియామకం జరగలేదు. ఇప్పటి వరకూ వివిధ రాజకీయ పార్టీలకు వెళ్లాల్సిన లేఖలు కూడా వెళ్లలేదు. సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపాలని కోరుతూ శాసనమండలి ఛైర్మన్ అన్ని పార్టీలకూ లేఖలు రాశారంటున్నారు. కానీ శాసనమండలి అధికారులు వాటిని రాజకీయ పార్టీలకు పంపలేదు. దీంతో సెలెక్ట్ కమిటీ నియామకం జరగేలేదు. అయితే ఛైర్మన్ ఆదేశాలను శాసనమండలి కార్యదర్శి అనుసరించాల్సిందేనని మాజీ మంత్రి యనమల రామకృష‌్ణుడు తెలిపారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు సక్రమంగా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకుంటే సభాధిక్కరణ పరిధిలోకి వస్తారని యనమల చెబుతుండటం విశేషం. ఇంతకీ ఛైర్మన్ ఆదేశాలు ఎక్కడ ఆగినట్లు? ఎంతవరకూ వచ్చినట్లు? అన్నది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News