Ktr : రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఎందుకు వెళ్లడం లేదు?

హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి కాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లుందన్నారు. కాంగ్రెస్ హుజూరాబాద్ లో బలహీనమైన [more]

Update: 2021-10-19 05:42 GMT

హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి కాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లుందన్నారు. కాంగ్రెస్ హుజూరాబాద్ లో బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టిందని కేటీఆర్ అన్నారు. ఇంతవరకూ హుజూరాబాద్ లో రేవంత్ రెడ్డి పర్యటించకపోవడానికి కారణాలేంటని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరినట్లుందని కేటీఆర్ అన్నారు.

ఏం అన్యాయం జరిగిందని?

ఈటల రాజేందర్ ను గెలిపిస్తే హుజూరాబాద్ కు ఏం ఒరుగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి హుజూరాబాద్ కు ఎంత నిధులు తెస్తుందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ లో ఏం అన్యాయం జరిగిందో ప్రజలకు వివరిస్తే బాగుంటుందని కేటీఆర్ చమత్కరించారు.

Tags:    

Similar News