బ్రేకింగ్ : కొండా దంపతులకు కాంగ్రెస్ షరతు ఇదే....!

Update: 2018-09-26 03:39 GMT

టీఆర్ఎస్ పై విరుచుకుపడి బయటకు వచ్చిన కొండా సురేఖ, కొండా మురళిలు కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. నిన్న ఉదయం హైదరాబాద్ లో మీడియా సమావేశం పెట్టి కేసీఆర్, కేటీఆర్ పై విరుచుకుపడిన కొండాదంపతులు అటు నుంచి అటే ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ సమక్షంలో కొండా దంపతులు పార్టీలో చేరనున్నారు.

కుటుంబానికి ఒక్కసీటు మాత్రమే.......

వరంగల్ జిల్లాలో పట్టున్న కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నాలుగైదు నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలదన్న విశ్వాసాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నా,రు. అయితే కొండా దంపతులు రెండు సీట్లు కోరుతుండగా, కాంగ్రెస్ దానికి కాంగ్రెస్ అంగీకరించదని అధిష్టానం తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ షరతుకు ఒప్పుకుంటేనే పార్టీలో చేరాలని చెప్పడంతో కొండా దంపతులు దానికి అంగీకరించి పార్టీలో చేరబోతున్నారు.

Similar News