బాబూ ….గుడివాడ కొడాలి నానిది

ఉల్లిపాయల ధరల పెరుగుదలపై ఏపీ అసెంబ్లీ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా నిన్న గుడివాడలో ఉల్లిపాయల కోసం వెళ్లి సాంబిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందారని [more]

Update: 2019-12-10 07:39 GMT

ఉల్లిపాయల ధరల పెరుగుదలపై ఏపీ అసెంబ్లీ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా నిన్న గుడివాడలో ఉల్లిపాయల కోసం వెళ్లి సాంబిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందారని చంద్రబాబు ఆరోపించారు. ఉల్లి ధరల పెరుగుదల ప్రజలు ప్రాణాలు తీస్తుందన్నారు. దీనిపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ చంద్రబాబు శవరాజకీయాలు చేయడంలో సిద్ధహస్తుడన్నారు. గుడివాడలో సాంబిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందింది ఉల్లిపాయల వల్ల కాదన్నారు. సాంబిరెడ్డి కుటుంబ సభ్యులే దీనిని ఖండిస్తున్నారని తెలిపారు. తమను రాజకీయాల్లోకి లాగొద్దని సాంబిరెడ్డి కుటుంబసభ్యులు వేడుకున్నా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అది ఉల్లి హత్యేనని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. “చంద్రబాబూ రాష్ట్రమంతటా నీ జాగీరు అనుకుంటున్నావేమో. అది గుడివాడ. అక్కడ కొడాలి నాని ఉన్నాడు. అది గుర్తుంచుకో” అని చంద్రబాబుకు కొడాలి నాని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మృతుడు సాంబిరెడ్డి కుటుంబసభ్యులు ఇచ్చిన వివరణను సభలో ప్రదర్శించారు.

చంద్రబాబు అంతే….

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు శవరాజకీయాలు చేయడంలో దిట్ట అని అన్నారు. ఉల్లిపాయలను దాదాపు వంద రూపాయల సబ్సిగీ ఇచ్చే రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. అయినా రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. సబ్బిడీ కింద ఇవ్వకపోయినా, తగినన్ని ఉల్లిపాయలు ఉంచడం వల్లనే క్యూలు రైతుబజార్లో కన్పిస్తున్నాయన్నారు.

Tags:    

Similar News