ఖైరతాబాద్ లో ఉద్రిక్తత

Update: 2018-05-14 07:53 GMT

సర్వీసులో నుంచి తొలగించిన హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు ఖైరతాబాద్ లో ఆందోళనకు దిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు 250 మంది హోంగార్డులను ఆర్డర్ కాపీ లేనందున విధుల నుంచి తొలగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వీరిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినా కూడా విధుల్లో తీసుకోలేదు. దీంతో కుటుంబసభ్యులతో సహా వారు ఖైరతాబాద్ లో ఆందోళనకు దిగారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హోర్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి అతనిని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. తాము రూ.3300 వేతనం ఉన్నప్పటి నుంచి సుమారు తొమ్మిదేళ్ల పాటు పనిచేశామని, తమను అకారణంగా తొలగించారని హోంగార్డులు వాపోయారు. తమను సర్వీసులోకి తీసుకుంటామన్న ముఖ్యమంత్రి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళన కారణంగా ఖైరతాబాద్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Similar News