కేరళ స్వామి...ముత్తూట్ లో బంగారం పెట్టి....!

Update: 2018-07-14 04:12 GMT

"మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా? మీరు ఆర్థికంగా బాగా నష్టపొయారా..? మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా.. ? అయితే మా జ్యోతిష్యాలయం ను కాంటాక్ట్ చేయండి" అంటూ ఏకంగా ఒక కాల్ సెంటర్ ను పెట్టిన నకీలీ బాబా పని పట్టారు పోలీసులు. ప్రజలను మోసం చేసి బంగారం తీసుకుని ఆ గొల్డ్ ను భార్య ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టి రుణాలు తీసుకుంటున్న వైనమిది. దోషాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న దొంగబాబా కుటుంబాన్ని పోలీసులు అరెస్టు చేశారు.

కేరళలో బహిష్కరించడంతో....

కేరళ లో పోకిరి.. అక్కడ అల్లరి చిల్లరి గా తిరిగే వాడు. అక్కడ పోలీసులు కేసులు పెట్టారు. కేరళలో బహిష్కరించారు. అయితే ఇండియాలో ఎక్కడైనా బతుక వచ్చు అనుకుంటూ పదకొండు సంవత్సరాల క్రితం హైదరబాద్ కు సురేష్ వచ్చాడు. హైదరబాద్ కు చేరుకున్న తరువాత శివొహం శివరాజు అని పేరు మార్చుకున్నాడు. తాను శివుడి భక్తుడని తెలిపాడు. ఇక్కడి ప్రజల వీక్‌ నెస్ మీద బాగా స్టడీ చేశాడు. ప్రజలకు మూఢ నమ్మకాలతో మగ్గి పోతున్నట్లుగా చూశాడు. దీంతో వెంటనే ఒక దుకాణం తెరిచాడు. తాను ఒక జ్యోతిష్యుడి నంటూ నమ్మించాడు. తనకు తాంత్రిక శక్తులన్నాయని చెప్పేవాడు. అంతేగాకుండా ఇబ్బందుల్లో వున్న వారిని బయట పడేస్తానని నమ్మించాడు. దీంతో జనాలు గుడ్డిగా నమ్మారు. పెద్ద ఎత్తున్న శివొహాం దగ్గరకు రావడం మొదలు పెట్టారు. ఇక్కడి వరకు బాగానే వుంది.

కాల్ సెంటర్ ఏర్పాటు చేసి....

రెండు రాష్ట్రాల నుంచి జనాలు రావడం మొదలు పెట్టారు. రెండు రాష్ట్రాల్ల నుంచి జన స్పందన చూసిన ఈ శివోహం స్వామి ఏకంగా ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశాడు. ఎర్రగడ్డ లో ఒక కాల్ సెంటర్ ను ఎర్పాటుచేసి అక్కడి నుంచి తన భక్తులను ఆపరేట్ చేయడం మొదలు పెట్టారు. ఇదిలా వుంటే ఇదే సమయంలో హైదరబాద్ లోని ఒక అమ్మాయితో పరిచయం అయ్యింది. అమ్మాయి ని వివాహం చేసుకున్నాడు. ఇటివల కాలంలో ఒక కొత్త బిజినెస్ కు తెర లెపాడు ఈ శివోహం స్వామి. మీరు ఆర్థికంగా వెనుక బడి వున్నట్లయితే తాను చెప్పినట్లుగా చేసినట్లయితే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని నమ్మించారు.

బంగారాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి.....

ఇదిలా వుంటే గత కొన్ని రొజులగా బంగారాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి భక్తులను నమ్మించారు. ఇందుకు గాను ప్రత్యేకంగా పూజలు చేస్తానని తెలిపారు.. ఇందుకు గా మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం చేశారు. ఇది నమ్మిన జనాలు శివోహం స్వామి వద్దకు వచ్చారు. బాగా డబ్బున్న వారి ఇంటికి వెళ్లి పూజలు చేయడం ఆరంభించారు. వారి ఇంటిలో వున్న బంగారాన్ని మొత్తం కూడా ఒక చెంబు లో వెయమని చెప్పే వాడు. ఇలా వేసిన తరువాత అందరిని తమ ఇష్టదైవాన్ని ప్రార్థించమని చెప్పి మరొక గదిలోకి పంపించే వాడు. ఇలా వారు వెళ్లిన తరవాత చెంబులో వున్న బంగారాన్ని తీసుకుని అందులో కొన్ని బియ్యాన్ని పోసి మూట కట్టి వెళ్లేవాడు. ఇలా వెళ్లే ముందు ఒక్క మాట చెప్పే వాడు రెండు సంవత్సరాల పాటుగా ఈ చెంబును ఎవరూ ముట్టుకోవద్దని. ఎవరైనా ముట్టుకుంటే బంగారం మొత్తం కూడా బియ్యంగా మారిపొతాయని చెప్పే వాడు.

ముత్తూట్ లో తాకట్టు పెట్టి.....

ప్రతి నెల నేను మీ ఇంటికి వచ్చి పూజలుచేసి వెళ్లిపొతానని చెప్పే వాడు. ఇలా నమ్మిన వారు రెండు సంవత్సరాల పాటుగా తీయలేదు. నమ్మని వాళ్లు చెంబు ను తెరిచి చూశారు. తాము మోసపొయామని చెప్పి రెండు రాష్ట్రాల లో చాల మంది ఫిర్యాదు చేశారు.ఇలా దోచుకుని తెచ్చిన బంగారాన్ని తన భార్యకు ఇచ్చే వాడు. ఆమె ఈ దొంగ బంగారాన్ని తీసుకుని పొయి ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టి రుణం తెచ్చుకునే వాళ్లు ఇలా ఇప్పటి వరకు కిలో ల కొద్ది బంగారు ఆభరణాలు వీరు ముత్తూట్ ఫైనాన్స్ లో కుదువ పెట్టారని పోలీసులు తెలిపారు. ఇక పొతే ఈ శివొహాం స్వామి మీద పోలీసులకు పెద్ద మొత్తంలో ఫిర్యాదు లు వచ్చాయి,. శివొహాం తో పాటుగా అతని భార్యను తెజస్వినిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Similar News