ఇష్టదైవాన్ని దర్శించుకున్న కేసీఆర్

Update: 2018-11-14 06:29 GMT

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన ఇష్టదైవాన్ని దర్శించుకున్నారు. సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలం కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి వద్ద నామినేషన్ పత్రాలను పెట్టి పూజలు చేశారు. ప్రతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు ఆయనకు ఈ ఆలయంలో పూజలు చేయడం సెంటిమెంట్. గత ఎన్నికల సమయంలోనూ ఆయన ఇక్కడ స్వామి వారిని దర్శించుకుని నామినేషన్ వేశారు.

సెంటిమెంట్ ప్రకారమే.....

ఇక్కడ నుంచి ఆయన గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం 2.34 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. మంత్రి హరీష్ రావు, ఇతర నేతలు కేసీఆర్ కు స్వాగతం పలికారు. 1980కి ముందు కోనాయిపల్లి గ్రామానికి చెందిన ఓ స్నేహితుడి ఇంటికి వచ్చాడు. ఒకరోజు అదే గ్రామంలో బస చేశాడు. ఆ రోజు కోనాయిపల్లి వెంకన్న మహత్యాన్ని తన స్నేహితుడు కేసీఆర్ కి చెప్పారు. దీంతో 1981లో జరిగిన ఎన్నికల్లో ఆయన మొదటిసారి కొనాయిపల్లి ఆలయానికి వచ్చి పూజలు చేసి నామినేషన్ వేశారు. అప్పటినుంచి ఆయనకు నామినేషన్ దాఖలు చేసే ముందు ఇక్కడ పూజలు చేయడం సెంటిమెంట్ గా మారింది.

Similar News