ఊహించని వారు కేబినెట్ లోకి?

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం దశమి కావడంతో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని [more]

Update: 2019-09-08 01:54 GMT

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం దశమి కావడంతో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు. రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియామకమైనన తమిళసై రంగరాజన్ కు కూడా మంత్రి వర్గ విస్తరణ సమాచారాన్ని ముఖ్యమంత్రి తెలియచేశారు. మంత్రి వర్గంలో కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ లకు ఛాన్స్ ఉండే అవకాశముంది. మంత్రివర్గం నుంచి ఒకరు లేదా ఇద్దరిని తప్పించే అవకాశముంది.

Tags:    

Similar News