మంత్రి పదవులు ఇలా పంచుకున్నారు

Update: 2018-06-01 12:06 GMT

ఎట్టకేలకు కర్ణాటక మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చింది. జూన్ 6న కుమారస్వామి మంత్రివర్గం కొలువుతీరనుంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య జరుగుతున్న చర్చలు ముగిశాయి. అయితే, జేడీఎస్ కి ఫైనాన్స్, ఎక్సైజ్, విద్యుత్, పీడబ్యూడీ సహా 12 శాఖలు, కాంగ్రెస్ పార్టీకి హోం, ఇరిగేషన్, వ్యవసాయం, గనులు సహా మొత్తం 16 శాఖలు కేటాయించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటులో, ఎమ్మెల్యేలను కాపాడటంలో కీలకంగా ఉన్న డీకే శివకుమార్ కి ఏ పదవి ఇస్తారనేది ఇంకా తేలలేదు. సంకీర్ణ ప్రభుత్వం సజావుగా నడిచేందుకు రెండు పార్టీల నేతలతో కలిసి సమన్వయ కమిటీని వేశారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పనిచేయనున్నారు.

Similar News