వశిష్టలో…..చిద్రమైన దేహాలు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోటు ఎట్టకేలకు బయటకు తీశారు. మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో బయటకు వచ్చింది. మంగళవారం [more]

Update: 2019-10-22 11:43 GMT

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోటు ఎట్టకేలకు బయటకు తీశారు. మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో బయటకు వచ్చింది. మంగళవారం డైవర్ల సాయంతో మరోసారి నీటి అడుగుభాగం నుంచి రోప్‌లు కట్టి వెలికితీశారు. పలుమార్లు వర్షం ఆటంకం కలిగించినా ఆపకుండా ప్రయత్నాలు కొనసాగించారు. జేసీబీ సాయంతో ఆ రోప్‌లను బయటకు లాగారు దీంతో నీళ్లపైకి బోటు వచ్చింది. బోటులో ఐదు మృతదేహాలను గుర్తించారు. ఆ మృతదేహాలు చాలా మటుకు పాడైపోయాయి. పూర్తిగా కుళ్లిపోయి దుర్గందం వస్తోంది. వీరంతా కూడా బోటులోని ఏసీలో ఉన్నవారిగా తెలుస్తోంది. ఇప్పటి వరకు తమ వారి ఆచూకీ తెలియని బంధువులంతా కచ్చులూరుకు వస్తున్నారు. మృతదేహాలను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు.

సత్యం గెలిచింది….

బాలాజీ మెరైన్స్‌ సంస్థకు చెందిన ధర్మాడి సత్యం బృందం రెండుసార్లు బోటు వెలికితీసే ప్రయత్నాలు చేసింది. బోటు మునిగిన కొద్ది రోజులకు బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వరద ఉధృతి పెరగడంతో వెలికితీత పనులు నిలిపివేశారు. వారంలో రెండోసారి ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ రెండు, మూడు రోజుల పాటూ ఇబ్బందులు ఎదురయ్యాయి. బోటును వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం విశాఖ నుంచి డైవర్స్‌ను పిలిపించారు. వారి సాయంతో గోదావరిలోకి దిగి బోటుకు రోప్‌లు కట్టి బయటకు లాగే ప్రయత్నాలు చేశారు. అది కూడా బెడిసికొట్టింది.ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు ఫలించకపోయినా మంగళవారం మళ్లీ రోప్‌లు కట్టి బోటును బయటకు లాగింది. ఈసారి మాత్రం బోటు నీళ్లపైకి తేలింది. సెప్టెంబర్ 15న బోటు కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 35మందికిపైగా చనిపోగా మరికొందరి ఆచూకీ దొరకలేదు.

 

Tags:    

Similar News