కేసీఆర్ కు ఝలక్ ..? సర్వే ఫలితం...!!

Update: 2018-11-10 02:50 GMT

నిన్న మొన్నటి వరకూ జరిపిన అన్ని సర్వేల్లోనూ తెలంగాణ రాష‌్ట్ర సమితి ముందుంది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నీ సర్వేలూ తేల్చి చెప్పాయి. కానీ తాజాగా ఒక సంస్థ జరిపిన సర్వేలో మాత్రం మహాకూటమి ముందుందని తేల్చింది. ఇది నిజంగా తెలంగాణ రాష్ట్ర సమితికి మింగుడుపడని అంశమే. తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, కోదండరామ్ సారథ్యం వహించిన తెలంగాణ జనసమితి, సీపీఐలు మహాకూటమిగా పోటీకి దిగిన సంగతి తెలిసిందే.

మహాకూటమికే మెజారిటీ......

అయితే తాజాగా సీ-ఓటరు నిర్వహించిన సర్వేలో మహాకూటమికి 64 స్థానాలు లభిస్తాయని తేలింది. మొత్తం 119 స్థానాలు గల తెలంగాణ అసెంబ్లీలో కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది. ఈ సర్వేలో మహాకూటమికి 33.9 శాతం ఓట్లు రాగా, టీఆర్ఎస్ కు 29. 4 శాతం మాత్రమే రావడం విశేషం. టీఆర్ఎస్ కేవలం 42 సీట్లకే పరిమితమవుతుందని సర్వే తేల్చింది. బీజేపీకి నాలుగు స్థానాలు దక్కే అవకాశముందని తేలింది. మొత్తం మీద తాజా సర్వే ఫలితాలతో గులాబీ బాస్ ఎలాంటి వ్యూహం రచిస్తారో చూడాల్సి ఉంది.

Similar News