కేసీఆర్ కీలక ప్రకటన ఎప్పుడంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లోనే కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఉద్యోగుల పీఆర్సీపై కేసీఆర్ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే పీఆర్సీ ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారని [more]

Update: 2021-03-21 01:09 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లోనే కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఉద్యోగుల పీఆర్సీపై కేసీఆర్ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే పీఆర్సీ ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రభుత్వం ప్రకటించలేక పోయింది. ఈ నెల 22వ తేదీన కేసీఆర్ అసెంబ్లీలో పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఫిట్ మెంట్ శాతం ఎంత ప్రకటిస్తారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాగర్ ఉప ఎన్నిక ఉన్నా అది నల్లగొండ జిల్లాకే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, కేసీఆర్ పీఆర్సీ ప్రకటిస్తారని ఉద్యోగ సంఘాలు ఆశాభఆవం వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News