కేసీఆర్ సర్కార్ పై బాబు ఆసక్తికర కామెంట్స్

Update: 2018-09-05 12:55 GMT

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు జరిగిన తెలుగుదేశంపార్టీ వర్క్ షాపులో చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకూ తెలంగాణ పాలనపై చంద్రబాబు పెద్దగా స్పందించింది లేదు. అయితే ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం అడిగిన వన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. తెలంగాణ సర్కార్ కు, కేంద్రానికి సత్సంబంధాలున్నాయని, అందువల్లే జోన్ల విషయంలో వెంటనే కేంద్రం స్పదించింది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఏపీ ప్రభుత్వం ఏమి అడిగినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తుతో వెళుతుందన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు టీఆర్ఎస్ పార్టీపై ఇలా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

Similar News