కేసీఆర్ సభ పెట్టడం మానుకో

సాగర్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రచార సభను రద్దు చేసుకోవాలని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కోరారు. ఈ నెల 14వ తేదీన కేసీఆర్ [more]

Update: 2021-04-12 01:20 GMT

సాగర్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రచార సభను రద్దు చేసుకోవాలని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కోరారు. ఈ నెల 14వ తేదీన కేసీఆర్ సభ హాలియాలో జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్నందున కేసీఆర్ సభను రద్దు చేసుకోవాలని జీవన్ రెడ్డి కోరారు. పొరుగు రాష్ట్రంలో జగన్ తన ప్రచార సభను రద్దు చేసుకున్న విషయాన్ని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సభ పెట్టి కేసీఆర్ కరోనా వ్యాప్తికి కారణం కాకూడదని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News