జనసేన ఎమ్మెల్యే అరెస్ట్ కు రంగం సిద్ధం

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ కు రంగం సిద్ధమయింది. పేకాట ఆడుతుండగా పట్టుబడ్డ రాపాక వరప్రసాద్ అనుచరుడిని విడిపించాలని కోరుతూ ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. [more]

Update: 2019-08-13 03:45 GMT

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ కు రంగం సిద్ధమయింది. పేకాట ఆడుతుండగా పట్టుబడ్డ రాపాక వరప్రసాద్ అనుచరుడిని విడిపించాలని కోరుతూ ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే మలికిపురం పోలీసులకు, రాపాక వరప్రసాద్ కుమధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఎమ్మెల్యే అనుచరుడిని విడుదల చేయకపోవడంతో జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ పై దాడిచేశారు. పోలీస్ స్టేషన్ కిటికీ అద్దాలు పగులకొట్టారు. దీంతో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ క్షణాన్నైనా రాపాక వరప్రసాద్ ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. దీంతో మలికి పురంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.రాజోలు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News