కేసీఆర్ గారూ….. నా మాట వినండి

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్‌‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె చేస్తే [more]

Update: 2019-10-07 10:30 GMT

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్‌‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె చేస్తే ఆర్టీసీ ఉద్యోగులు కూడా అందులో భాగం అయ్యారని, వారి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్ధం చేసుకుని పరిశీలించాలని, కఠినమైన నిర్ణయాలను తీసుకోకూడదన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె సందర్భంగా 48,660 మంది ఉద్యోగులలో 1,200 మందిని తప్ప మిగిలిన వారినందరినీ ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా 17 రోజుల పాటు ఆ నాడు తెలంగాణ పరిధిలోవున్న ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా నిలిచారన్నారు. వారు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని, ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఉభయులకూ విజ్ఞప్తి చేస్తున్నాని పవన్ కళ్యాణ్ ఇటు ప్రభుత్వానికి అటు కార్మిక నేతలకు విన్నవించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

 

Tags:    

Similar News