హ‌రీష్ పాపం… కేసీఆర్‌కు శాపం

హ‌రీష్ రావు చేసిన పాపం మెద‌క్ జిల్లా ప్ర‌జ‌ల‌కు, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు శాపంలా మారింద‌ని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. మెద‌క్ జిల్లా ప్ర‌జ‌ల దాహ‌ర్తి [more]

Update: 2019-02-13 11:15 GMT

హ‌రీష్ రావు చేసిన పాపం మెద‌క్ జిల్లా ప్ర‌జ‌ల‌కు, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు శాపంలా మారింద‌ని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. మెద‌క్ జిల్లా ప్ర‌జ‌ల దాహ‌ర్తి తీర్చాల్సిన మంజీరా నీటిని అర్థ‌రాత్రి అధికారుల‌పై ఒత్తిడి తెచ్చి దోపిడీ చేశార‌ని ఆరోపించారు. మిష‌న్ భ‌గీరథ ద్వారా నిళ్లీవ్వాల‌నుకున్న కేసీఆర్ కోరిక‌కు హ‌రీష్ తూట్లు పొడిచార‌ని పేర్కొన్నారు. చేసిన త‌ప్పుకు హ‌రీష్ రావు మెద‌క్ జిల్లా ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ క్షమాపణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తాను గెలిస్తే హ‌రీష్ రావును ప్ర‌శ్నిస్తాన‌నే ఉద్దేశంతోనే త‌న‌ను అరెస్టు చేయించార‌ని జ‌గ్గారెడ్డి ఆరోపించారు. హ‌రీష్ రావు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, త‌క్ష‌ణ‌మే కేసీఆర్ జోక్యం చేసుకోవాల‌ని కోరారు.

Tags:    

Similar News