ఇంత స్కామా? మీరే చూడండి

గుంటూరు, కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4,070 [more]

Update: 2020-01-20 07:14 GMT

గుంటూరు, కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4,070 ఎకరాలను టీడీపీ నేతలు తమ పేరిట తమ బినామీల పేరిట కొనుగోలు చేశారని ఆరోపించారు. తాడికొండ మండలం కంటేరు గ్రామంలో 7, 7 2014లో హెరిటేజ్ ఫుడ్స్ 14 ఎకరాల ఎనిమిది సెంట్లను కొనుగోలు చేశారన్నారు. జూన్ రెండున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు, తర్వాత కూడా భూములు కొనుగోలు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ తుళ్లూరు గ్రామంలో పెద్దయెత్తున కొనుగోలు చేశారన్నారు. వేమూరు రవికుమార్ ప్రసాద్ తన కంపెనీ పేరు మీద, ఆయన పేరు మీద, ఆయన సోదరుడు వేమూరు ప్రసాద్ పేరు పై భూములు కొనుగోలు చేశారన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత అమరావతి మండలం ధరణికోట గ్రామంలో పీఆర్ ఇన్ ఫ్రా పేరు మీద కొన్ని ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నలభై ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. రాజధాని ప్రాంతంలోని సగం గ్రామాల్లో భూములు కొనుగోలు చేశారన్నారు. లింగమనేని రమేష్ 80 ఎకరాలను కొనుగోలు చేశారన్నారు.

పెద్దయెత్తున కొనుగోలు చేసి…..

పయ్యావుల కేశవ్ తన కుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరిట ఐనవోలులో కొనుగోలు చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావు కూతురు, యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ పేరిట భూములు కొన్నారన్నారు. మాజీ మంత్రి నారాయణ బినామీల పేరిట కొనుగోలు చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ భూములు కొన్నారన్నారు. నారాలోకేష్ బినామీ వేమూరి రవి 64 ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. మురళీమోహన్ కూడా తన కుటుంబ సభ్యులు, జయభేరిి ప్రొడక్షన్ పైన కొనుగోలు చేశారన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని బుగ్గన తెలిపారు. అనంతపురంలో ఉన్న వారికి ఇక్కడ మందడం అన్న గ్రామం ఉందని ఎలా తెలుస్తుందని బుగ్గన ప్రశ్నించారు. దీన్ని బట్టి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నది స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. ఓత్ ఆఫ్ సీక్రెసీని కూడా చంద్రబాబు ఉల్లంఘించారని తెలిపారు. సీఆర్డీఏ పరిధిని కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారని చెప్పారు. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాల పాటి శ్రీధర్ కూడా ఇక్కడ భూముల కొనుగోలు చేశారని చెప్పారు. సుజనా చౌదరి కూడా తన కుటుంబసభ్యుల పేరిట కొనుగోలు చేశారని చెప్పారు. చివరకు అసైన్డ్ భూములను కూడా వదలలేదన్నారు. అమరావతిపై ఇంత ప్రేమ వారికి అందుకేనని బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News