భారీగా పతనమైన రూపాయి

Update: 2018-08-14 09:07 GMT

మన రూపాయి అత్యంత కనిష్ఠానికి పతనమైంది. అమెరికన్ డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం 70.09 కి పడిపోయింది. టర్కీలో ఆర్థిక మాంధ్యం భయం నేపథ్యంలో తలెత్తిన సంక్షోభ పరిస్థితుల ప్రభావం మనపైనా పడింది. దీంతో స్వాతంత్ర్యం నాటి నుంచి ఎప్పుడూ లేనంత కనిష్ఠ స్థాయికి రూపాయి పతనమైంది. ఈ అంశం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ‘‘ ఎట్టకేలకు ప్రధాని మోదీ 70 ఏళ్లలో జరగని పనిని చేశారు’’ అని ట్వీట్ చేసింది. రూపాయి - డాలర్ విలువను చూపితూ స్క్రీన్ షాట్ జతచేశారు.

Similar News