తొమ్మిది రాష్ట్రాల్లో కరోనా కల్లోలం

భారత్ ను మరోసారి కరోనా వైరస్ వణికిస్తుంది. తొమ్మిది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. రోజుకు నలభై వేల కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ [more]

Update: 2021-03-21 01:31 GMT

భారత్ ను మరోసారి కరోనా వైరస్ వణికిస్తుంది. తొమ్మిది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. రోజుకు నలభై వేల కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేశాక ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో భారత వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. పాఠశాలలు తెరవడంతో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటించాలంటూ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News