ఎట్టకేలకు ఫలించిన భారత్ ప్రయత్నాలు..!

పాకిస్థాన్ లో తల దాచుకున్న మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గత కొన్నేళ్లుగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. మసూద్ అజార్ ను [more]

Update: 2019-05-01 13:26 GMT

పాకిస్థాన్ లో తల దాచుకున్న మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గత కొన్నేళ్లుగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. ముంబై సహా మన దేశంలో జరిగిన ఉగ్రదాడుల్లో మసూద్ అజర్ పాత్ర ఉందని ధర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దీంతో అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐరాసలో భారత్ కోరుతూ వస్తోంది. భారత్ డిమాండ్ కు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా పలు దేశాలు మద్దతు ఇస్తున్నాయి. కానీ, ఐరాస శాశ్వత భద్రతా మండలిలో సభ్యత్వం ఉన్న చైనా మాత్రం వ్యతిరేకిస్తూ వస్తోంది. నాలుగుసార్లు చైనా మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుకుంది. చివరకు అన్ని దేశాల నుంచి ఒత్తిడి రావడంతో చైనా తలొగ్గింది. దీంతో ఇవాళ అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించింది. ఇప్పుడు పాకిస్థాన్ అతడిని అరెస్టు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తుంది.

Tags:    

Similar News