బ్రేకింగ్ : ఏపీ పరిణామాలపై కేంద్రం సీరియస్...!

Update: 2018-10-05 11:09 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయని ముందుగానే కొన్ని పత్రికల్లో, టీవీల్లో కథనాలు రావడాన్ని కేంద్రం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఐటీ శాఖకు సహకరించాల్సిన పోలీసులు ముందుగానే ప్రభుత్వానికి లీకులివ్వడాన్ని తీవ్రంగా కేంద్రం పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు. దాదాపు 200 మంది ఐటీ శాఖ అధికారులు బెజవాడకు వచ్చి దాడులు చేస్తున్నారన్న సమాచారం పత్రికలకు లీక్ చేయడంపై ఐటీ అధికారులు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.

హోంశాఖకు ఐటీ అధికారుల ఫిర్యాదు.....

స్థానిక పోలీసు అధికారులే ఈ సమాచారాన్ని లీక్ చేశారని ఐటీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యనేతలతో చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీయే ఈ దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలిసింది. రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ దాడులకు దిగారని చంద్రబాబు అన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఐటీ శాఖ అధికారులు వచ్చారంటే అందులో ఖచ్చితంగా మోదీ ప్రమేయం ఉందని కొందరు మంత్రులు సయితం అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి సూచించారు.

Similar News