ఇంకా పితాని అజ్ఞాతంలోనే…. హైకోర్టులోనూ

ఈఎస్‌ఐ స్కాం కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. సురేష్‌ ముందస్తు బెయిల్‌‌ పిటిషన్‌‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈఎ‌స్‌ఐ [more]

Update: 2020-07-13 12:25 GMT

ఈఎస్‌ఐ స్కాం కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. సురేష్‌ ముందస్తు బెయిల్‌‌ పిటిషన్‌‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈఎ‌స్‌ఐ కుంభకోణంలో నిందితులుగా ఉన్న వెంకట సురేశ్‌, మాజీ కార్యదర్శి మురళీమోహన్‌ ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాజకీయ కక్షతో ఈ కేసులో ఇరికించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చల్లా అజయ్‌కుమార్‌ వాదించారు. వెంకట సురేశ్‌ ఏనాడూ తన తండ్రి పదవిని దుర్వినియోగం చేయలేదని వివరించారు. ఆయన వద్ద కార్యదర్శిగా ఉన్న మురళీమోహన్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొన్నారు. అందువల్ల ఈ కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. వీరి వాదనతో ఏసీబీ తరఫు న్యాయవాది విభేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వులో ఉంచారు. అయితే తిరిగి సురేశ్ బెయిట్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరువాదనలు విన్న న్యాయమూర్తి, సురేశ్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించారు. పితాని సురేష్ ఇంకా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Tags:    

Similar News