నీకూ...నాకూ...ఐకియా...!

Update: 2018-08-09 07:05 GMT

స్వీడన్ కు చెందిన ప్రముఖ ఫర్నీచర్ విక్రయ సంస్థ ఐకియా భారత్ లో తమ మొదటి బ్రాంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీ వద్ద 13 ఎకరాల విశాల స్థలంలో ఏర్పాటుచేసిన ఈ స్టోర్ గురువారమే ప్రారభమవుతోంది. రూ.వెయ్యి కోట్ల భారీ పెట్టుబడితో ఈ స్టోర్ ను ఏర్పాటు చేశారు. ఇందులోనే వెయ్యి మంది కూర్చునేలా భారీ రెస్టారెంట్ కూడా ఏర్పాటుచేశారు. మొత్తం 950 మంది ఇందులో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఐకియా ద్వారా మరో 1500 మందికి కూడా ఉపాధి దొరుకుతుంది. సంవత్సరానికి 70 లక్షల మంది వినియోగదారులు స్టోర్ కి వస్తారని సంస్థ అంచనా వేస్తోంది.

అందరికీ అందుబాటు ధరలో

హైదరాబాద్ తర్వాతి స్టోర్ ను 2019 వేసవిలోపు ముంబాయిలో ఏర్పాటుచేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత బెంగళురు, గురుగావ్ సహ 2025 నాటికి దేశంలో 25 పట్టణాల్లో స్టోర్ లను ఏర్పాటుచేయాలని ఐకియా భావిస్తోంది. ప్రస్థుతం ఈ సంస్థకు 49 దేశాల్లో 403 స్టోర్లు ఉన్నాయి. అయితే, ఇంత భారీ సంస్థలో వస్తువుల సామాన్యులకు అందుబాటులో ఉండవు అనుకోవద్దు అంటున్నారు సంస్థ ప్రతినిధులు. మధ్య తరగతి ప్రజలు సైతం కొనుగోలు చేయగలిగేలా 7500 వస్తువులు ఉంటాయని, అందులో 1000 వస్తువులు రూ.200 లోపు ధరవే అని తెలిపారు.

Similar News