బీరుట్ లో భారీ పేలుడు….70 మందికి పైగానే మృతి

లెబనాన్ రాజధాని బీరుట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 74 మంది మరణించినట్లు సమాచారం. పేలుళ్ల ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. [more]

Update: 2020-08-05 02:45 GMT

లెబనాన్ రాజధాని బీరుట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 74 మంది మరణించినట్లు సమాచారం. పేలుళ్ల ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. బీరుట్ పోర్టు ఆనవాళ్లు కూడా కన్పించడం లేదు. బీరుట్ పోర్టులో అమ్మోనియం నిల్వలను గత ఆరేళ్లుగా నిల్వ చేసినట్లు చెబుతున్నారు. దీనివల్లనే ప్రమాదం సంభవించిందని అంటున్నారు. బీరుట్ కు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీవికి పేలుడు శబ్దాలు విన్పించాయంటే ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Tags:    

Similar News