జగన్ పై హత్యాయత్నం కేసులో కోర్టు ఆదేశాలు..!

Update: 2018-11-09 06:52 GMT

తనపై హత్యాయత్నం ఘటనను స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వేసిన రిట్ పిటీషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. హత్యాయత్నం ఘటనలో కుట్ర ఉందని జగన్ తరపు న్యాయవాదులు వాదించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల అజమాయిషి లేని విచారణ సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. డీజీపీ వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయన్నారు. అయితే, పోలీసుల విచారణపై మీకు ఎందుకు నమ్మకం లేదని జగన్ తరపు న్యాయవాదులను కోర్టు ప్రశ్నించింది.

సీల్డ్ కవర్ లో సిట్ రిపోర్టు...

అయితే, ఘటన జరగగానే డీజీపీ, మంత్రులు, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో, ఘటనకు సంబంధించిన సిట్ రిపోర్టును సీల్డ్ కవర్ లో మంగళవారం సమర్పించాలని కోర్టు ఏపీ అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. ఈ కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మరో వైపు ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఇవాళ పోలీసులు విశాఖపట్నం కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టు అతడికి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ ను పొడిగించింది.

Similar News