ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Update: 2018-06-26 10:20 GMT

రైతుబంధు పథకం అందరికీ అమలు చేయడం వల్ల ప్రజాదనం దుర్వినియోగం అవుతుందని, కేవలం పేద, చిన్న రైతులకే ఈ పథకం వర్తింపజేయాలని కోరుతూ నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రాసిన లేఖకు హైకోర్టు స్పందించింది. ఈ లేఖను న్యాయస్థానం ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. రైతుబంధు పథకం వల్ల ధనికులు ఇంకా లబ్ధి పొందుతున్నారని, పేదలకు న్యాయం జరగడం లేదని నల్గొండకు చెందిన న్యాయవాది యాదగిరి రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. ఎన్నారైలు, ప్రభుత్వోద్యోగులు, ఇన్ కం ట్యాక్స్ కట్టే వారిని ఈ పథకం నుంచి తొలగించాలని ఆయన కోరారు. ఈ లేఖను విచారణ తీసుకున్న కోర్టు రైతుబందు పథకంపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Similar News