బ్రేకింగ్ : జగన్ కేసులో కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశాలు

Update: 2018-12-05 07:59 GMT

ప్రతపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేంద్ర ధర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని దాఖలైన పిటీషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. జగన్ పై దాడి సెక్షన్ 3(ఏ) కిందకు రాదని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే, ఆయన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. అసలు ఈ ఘటనపై దర్యాప్తును ఎన్ఐఏ కి ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించగా... వ్యక్తిగత దాడి అయినందున రాష్ట్ర ప్రభుత్వమే విచారణ జరుపుతుందని ఏజీ పేర్కొన్నారు. అయితే, ఏజీ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఈ నెల 14 లోగా ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేస్తారో? లేదో? తేల్చి చెప్పాలని కేంద్రానికి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Similar News