కరోనా విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

వైద్య సిబ్బందికి తగిన కరోనా నివారణ కిట్లు ఇవ్వడం లేదన్న ప్రజాప్రయోజన వ్యాజ్యం పై హైకోర్టులో విచారణ జరిగింది. పీపీఈ కిట్లు, మాస్కులు ఎన్ని వచ్చాయి? సిబ్బందికి [more]

Update: 2020-06-17 13:57 GMT

వైద్య సిబ్బందికి తగిన కరోనా నివారణ కిట్లు ఇవ్వడం లేదన్న ప్రజాప్రయోజన వ్యాజ్యం పై హైకోర్టులో విచారణ జరిగింది. పీపీఈ కిట్లు, మాస్కులు ఎన్ని వచ్చాయి? సిబ్బందికి ఎన్ని ఇచ్చారో నివేదికలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రేపటి లోగా వివరాలివ్వాలని గాంధీ, నిమ్స్, ఫీవర్, కింగ్ కోఠి ఆస్పత్రుల సూపరింటెండెంట్ లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, గాంధీ సూపరింటెండెంట్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు కోరింది. గాంధీ ఆసుపత్రిలో జూడాలు సమ్మె చేయడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు కరోనా విస్తరించిందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని పేర్కొంది. రాష్ట్రంలో కరోనాకు ఎదుర్కొనే సన్నద్ధత తగినంతగా కనిపించడం లేదని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా నియంత్రణ పై ప్రభుత్వానికి ఆసక్తి, ఉత్సాహం పోయిందని హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజలే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలన్న ధోరణి ప్రభుత్వం లో కనిపిస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని 3 వారాలుగా ప్రభుత్వాన్ని కొడుతూనే ఉన్నామని హైకోర్టు పేర్కొంది. కరోనా చికిత్సలు గాంధీకే ఎందుకు పరిమితం చేశారని హైకోర్టు ప్రశ్నించింది. నిమ్స్ వంటి ఆస్పత్రులను ఎందుకు వినియోగించడం లేని హైకోర్టు నిలదీసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Tags:    

Similar News