కరోనా ఎఫెక్ట్…టెన్త్ పరీక్షలు వాయిదా

పదో తరగతి పరీక్షలకు కరోనా దెబ్బ తగిలింది. నిన్నటి నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పదోతరగతి [more]

Update: 2020-03-20 08:55 GMT

పదో తరగతి పరీక్షలకు కరోనా దెబ్బ తగిలింది. నిన్నటి నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పదోతరగతి పరీక్షలు వాయిదా వేయాలంటూ హైకోర్టులో పవన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు, ప్రతి వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేసింది. కరోనా తీవ్రత ఉన్నందున పరీక్షలు వాయిదా వేసిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించింది. అంతేకాకుండా ఈ నెల 30వ తేదీ వరకు కూడా పరీక్షలను వాయిదా వేయాలని పేర్కొంది. ఆ తర్వాత సమీక్షించిన తర్వాత కొత్త షెడ్యూల్ విడుదల చేయమని హైకోర్టు వెల్లడించింది. అయితే రేపు జరగబోయే పరీక్ష మాత్రమే యధాతధంగా ఉంటుందని పేర్కొంది. సోమవారం నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొంది. సోమవారం నుంచి 30వ తేదీ వరకు పరీక్ష నిరవధికంగా వాయిదా వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News