హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులకు శుభవార్త..

Update: 2018-06-07 07:10 GMT

హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులకు సంబంధంచి అమెరికా ప్రభుత్వం మార్పులు చేస్తుందని, దీని ప్రభావం ఈ విసాలపై అమెరికాలో ఉన్న భారతీయులపై పడుతుందని జరిగిన ప్రచారంపై బుధవారం కొంత స్పష్టత వచ్చింది. ఢిల్లీలో యూఎస్ మిషన్ ఆధ్వర్యంలో స్టూడెంట్ వీసాడే జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన యూఎస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్(డీసీఎం) మేరీకే ఎల్ కార్ల్ సన్ మాట్లాడుతూ... హెచ్-1బీ, హెచ్-4 విసాల విధానంలో పెద్దగా మార్పులేమీ ఉండవని స్పష్టత చేశారు.

భారతీయులకు సంబంధించిన ఎంప్లాయిమెంట్ వీసాలు, వర్క్ పర్మిట్లపై అమెరికా దేశ సార్వభౌమాధికారానికి లోబడి నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఒబామా పాలన నిర్ణయాలను తుడిచేయాలని భావిస్తున్న ప్రస్తుత అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ హెచ్-4 వీసాలపై పున:సమీక్షించాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే హెచ్-1బి విసాదారుల జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్-4 వీసాలపై అమెరికాలో పెద్దసంఖ్యలో ఉన్న భారతీయులపై ప్రభావం పడే అవకాశం ఉంది. గత నెల విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ట్రంప్ ప్రభుత్వం హెచ్-4 వీసాలపై సమీక్షిస్తున్నారని, భారతీయులకు ఇబ్బంది కాకుండా తాము ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు అమెరికా అధికారులే వీసా పాలిసీలో పెద్దగా మార్పులుండవి చెప్పడంతో ఆ వీసాలపై అమెరికాలో ఉన్న భారతీయులకు పెద్ద ఊరట లభించినట్లేనని చెప్పుకోవాలి.

Similar News