రాజధాని జగన్ ఇష్టమే

రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. అభివృద్ధి ఒకే చోట జరగకూడదని, అన్ని ప్రాంతాల్లో జరగాలని జీవీఎల్ [more]

Update: 2019-09-19 07:38 GMT

రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. అభివృద్ధి ఒకే చోట జరగకూడదని, అన్ని ప్రాంతాల్లో జరగాలని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలన్నారు. చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబు అభివృద్ధిని అమరావతికే పరిమితం చేశారని జీవీఎల్ విమర్శించారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఆయన ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలని జీవీఎల్ కోరారు. రీటెండర్లు ఇస్తే ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు.

Tags:    

Similar News